: ఆన్ లైన్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు


హైటెక్ వ్యభిచార ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. హైదరాబాద్ లోని కేపీహెచ్ బీ కాలనీలో గ్రీన్ గెస్ట్ హౌస్ లో ఈ వ్యభిచారం సాగుతోందన్న సమాచారం ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగగా ఏడుగురు విటులు, ఇద్దరు యువతులు పట్టుబడ్డారు. పాతబస్తీకి చెందిన మాలిక్ కోల్ కత, ముంబై నుంచి యువతులను రప్పిస్తూ, ఆన్ లైన్ ద్వారా విటులను ఆకర్షిస్తునట్లు పోలీసులు తెలిపారు. మాలిక్ మాత్రం పరారయ్యాడు. ఆరు రోజుల క్రితం మాదాపూర్ ప్రాంతంలో సీరియల్ ఆర్టిస్ట్ కూడా వ్యభిచారం కేసులో పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఈ వరుస సంఘటనలు సిటీలో పెరిగిపోతున్న అసాంఘిక కార్యకలాపాలకు నిదర్శనం.

  • Loading...

More Telugu News