: సీమాంధ్రులకు దిగ్విజయ్ ప్యాకేజీ భరోసా
విభజన నేపథ్యంలో అభద్రతాభావం, భవిష్యత్ భయంతో తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్న సీమాంధ్ర ప్రజలకు కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ దిగ్విజయ్ సింగ్ ప్యాకేజీ భరోసో ప్రకటిస్తున్నారు. సీమాంధ్రుల అభివృద్ధికి ప్యాకేజీ ఇస్తామని తన ట్విట్టర్ అకౌంట్ లో హామీ ఇచ్చారు. ముఖ్యంగా విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో సీమాంధ్రులకు అవకాశాలు మెరుగుపరుస్తామని ట్వీట్ చేశారు. ఇందుకు అందరూ సహకరించాలని పేర్కొన్నారు.