: పేగు ఇన్‌ఫెక్షన్‌కు కొత్త మందు
మనకు వచ్చే వ్యాధుల్లో పేగు ఇన్‌ఫెక్షన్ బాగా బాధించే జబ్బు. ఈ జబ్బును నయం చేయడం చాలా కష్టమైన పని. ఇలాంటి జబ్బుకు శాస్త్రవేత్తలు కొత్త మందును కనుగొన్నారు. అయితే ఈ కొత్తమందును మానవ వ్యర్ధాలనుండి తయారుచేయడం విశేషం.
పేగుల్లో వచ్చే ఇన్‌ఫెక్షన్ వల్ల మనకు అతిసారం రావడంతోబాటు ఒక్కోసారి మరణానికి కూడా దారితీస్తుంది. ఇలాంటి ఇన్‌ఫెక్షన్‌కు కారణం క్లొస్ట్రిడియం డిఫిసిల్ అనే బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా వల్ల వచ్చే పేగు ఇన్‌ఫెక్షన్‌కు మానవ వ్యర్థాలనుండి సేకరించిన బ్యాక్టీరియాతో చికిత్స చేయవచ్చని కెనడాకి చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీరు ఈ బ్యాక్టీరియా వల్ల వ్యాధికి గురైన సుమారు 32 మందిపై పరిశోధనలు చేశారు. క్లొస్ట్రిడియం డిఫిసిల్ కారక పేగు ఇన్‌ఫెక్షన్‌కు గురై మళ్లీ మళ్లీ బాధపడుతున్న వారికి మానవ వ్యర్థాలోని బ్యాక్టీరియాతో తయారుచేసిన మందులను ఉపయోగించిన తర్వాత ఫలితం కనిపించిందని, తర్వాత మళ్లీ వారికి ఇన్‌ఫెక్షన్ సోకలేదని లైవ్‌సైన్స్ పేర్కొంది.