: రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కోతలకు రంగం సిద్ధం
సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల సమ్మెకారణంగా విద్యుత్ సంక్షోభం ఏర్పడటంతో... కరెంట్ కోతలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... కార్పొరేషన్లలో 4 నుంచి 6 గంటలు, మునిసిపాలిటీల్లో 6 నుంచి 10 గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 10 గంటలకు పైగా విద్యుత్ కోత విధించనున్నారు. ఈ కోతలు కేవలం సీమాంధ్ర ప్రాంతానికే కాకుండా తెలంగాణ ప్రాంతానికి కూడా వర్తించనున్నాయి.