: ప్రజలు కోరితే రాజీనామా చేస్తా : కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్
తాను కూడా సమైక్యవాదినేనని కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ తెలిపారు. ప్రజలు కోరితే రాజీనామా చేయడానికి కూడా వెనుకాడనని అన్నారు. విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విధంగా స్పందించారు. తాను ఇప్పటివరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకే ప్రయత్నించానని కిషో్ర్ చంద్రదేవ్ తెలిపారు. విభజనకు అడ్డుకట్ట వేసేందుకే... రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేయాలని తాను ప్రతిపాదించినట్టు వెల్లడించారు. మాతృవియోగం కారణంగా ఆయన కేంద్ర కేబినేట్ భేటీకి హాజరు కాలేకపోయారు.