: విద్యుత్ ఉద్యోగులు సమ్మె విరమించాలి : సీఎం


సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యుత్ ఉద్యోగుల సమ్మె బాట పట్టడంతో... సీమాంధ్రలోని జిల్లాల్లో విద్యుత్ సంక్షోభం నెలకొంది. దీంతో పాటు విద్యుత్ లోటుతో ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో సర్దుబాటు చర్యలు చేపట్టడానికి సీఎం కిరణ్ రంగంలోకి దిగారు. విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో... సాధారణ ప్రజానీకం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని... కాబట్టి విద్యుత్ ఉద్యోగులు వెంటనే సమ్మె విరమించాలని కోరారు. శాంతిభద్రతలపై సమీక్ష చేపట్టిన సందర్భంలో సీఎం ఈ విధంగా విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News