: రగులుతున్న విజయనగరం.. పోలీసులపై నిప్పు బంతులతో దాడి
విజయనగరం పట్టణంలో నిన్న రాత్రి నుంచే కర్ఫ్యూ అమల్లో ఉన్నప్పటికీ ఆందోళనలు ఏ మాత్రం అదుపులోకి రావడం లేదు సరికదా, అవి అంతకంతకూ పెరుగుతున్నాయి. సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగినప్పటికీ ఈ రోజు కూడా ఆందోళనకారులు పీసీసీ అధ్యక్షుడు బొత్స ఆస్తులపై దాడులకు పాల్పడుతున్నారు. మరోవైపు పట్టణంలోని కన్యకాపరమేశ్వరీ ఆలయం వద్ద ఆందోళనకారులు రెచ్చిపోయి పోలీసులపై నిప్పుబంతులు విసిరారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఆందోళనకారులపైకి రబ్బరు బుల్లెట్లను ప్రయోగిస్తున్నారు. ముఖ్యంగా 25ఏళ్ల లోపు వయసున్న యువకులు దాడుల్లో పాల్గొంటూ ఉండడం గమనార్హం. మొత్తం మీద పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.