: ప్రకాశం జిల్లాలో అంధకారంలో 500 గ్రామాలు
సీమాంధ్రలోని విద్యుత్ ఉద్యోగుల సమ్మె కారణంగా ప్రకాశం జిల్లాలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో, జిల్లాలోని యర్రగొండపాలెం సబ్ స్టేషన్ పరిధిలోని 500 గ్రామాలకు విద్యుత్ సరఫరా పూర్తి స్థాయిలో నిలిచిపోయింది.