: అసెంబ్లీకి తీర్మానం కచ్చితంగా వస్తుంది : పార్థసారథి


రాష్ట్ర విభజన తీర్మానం అసెంబ్లీకి కచ్చితంగా వస్తుందని... అప్పుడు దాన్ని తాము అడ్డుకుంటామని మంత్రి పార్థసారథి తెలిపారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక వేళ అసెంబ్లీకి తీర్మానం రాకపోతే ఏం చేస్తారని విలేకరులు అడగ్గా... 5 కోట్ల మంది చేస్తున్న ఉద్యమానికి కేంద్రం తప్పకుండా స్పందిస్తుందని బదులిచ్చారు. తిరుపతిలో మొట్టమొదటి మహిళా వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు.

  • Loading...

More Telugu News