: సచిన్, ద్రవిడ్ ల ఆఖరి టీ20 నేడే
ఛాంపియన్స్ లీగ్ టీ20 తుది అంకానికి చేరుకుంది. ఈ రోజు రాత్రి 8 గంటలకు ఢిల్లీలో జరగబోయే ఫైనల్స్ లో ముంబై ఇండియన్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడబోతోంది. స్టార్ క్రికెట్, స్టార్ స్పోర్ట్స్ లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారంకానుంది.
ఈ రోజు జరగనున్న మ్యాచ్ తో ఇద్దరు బ్యాటింగ్ దిగ్గజాలు... సచిన్, ద్రవిడ్ టీ20లకు గుడ్ బై చెప్పబోతున్నారు. ఛాంపియన్స్ లీగ్ కు ముందే వీరిద్దరూ ఈ టీ20 సీజనే తమకు లాస్ట్ అని ప్రకటించేశారు. దీంతో, ఈ మ్యాచ్ తో ద్రవిడ్ అన్ని రకాల క్రెకెట్ నుంచి తప్పుకున్నట్టవుతుంది. ఎందుకంటే, ద్రవిడ్ ఇప్పటికే టెస్ట్, వన్డే ఫార్మాట్ ల నుంచి తప్పుకున్నాడు. ఇక సచిన్ విషయానికొస్తే... ఇప్పటికే వన్డేలకు గుడ్ బై చెప్పేశాడు. ఈ మ్యాచ్ తో చివరి టీ20 ఆడబోతున్నాడు. సో, ఇక టెస్ట్ మ్యాచుల్లో మాత్రమే సచిన్ విన్యాసాలను చూడగలం. ఈ రోజు జరగనున్న ఫైనల్లో వీరిద్దరూ ఒకరితో మరొకరు పోటీపడుతుండటం... మ్యాచ్ ను మరింత గ్లామరస్ గా మార్చేసింది.