: సచిన్ పరుగులు.. 50,009
సచిన్ తన క్రికెట్ చరిత్రలో మరో మైలురాయిని అధిగమించారు. 50వేల పరుగులు దాటిన 16వ ఆటగాడిగా జాబితాకెక్కారు. నిన్న ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన చాంపియన్స్ లీగ్ టీ20 మ్యాచ్ ఇందుకు వేదికగా నిలిచింది. 67,057 పరుగులతో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ గ్రాహం గూచ్ జాబితాలో అగ్రభాగాన ఉన్నాడు. మొత్తం 953 మ్యాచులలో సచిన్ 50,009 పరుగులను నమోదు చేశారు. ఇందులో టెస్ట్, వన్డే, ఇతర మ్యాచులు కూడా ఉన్నాయి.