: సోదరుడి నుంచి ప్రాణభయం ఉందంటూ రోజా ఫిర్యాదు
సినీ నటి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రోజా తనకు ప్రాణభయం ఉందంటూ రాయదుర్గం పోలీసులను ఆశ్రయించారు. తన సోదరుడు వై.రామ్ ప్రసాద్ రెడ్డి ఇబ్బందుల్లో ఉన్నాడని, వాటి నుంచి బయటపడేందుకు తనను వేధిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. గురువారం రామ్ ప్రసాద్, అతడి మేనేజర్ ప్రసాదరాజు తన ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వకపోతే తప్పుడు ప్రచారానికి పాల్పడతామని వేధించినట్లుగా తెలిపారు. 22 ఏళ్ల సినిమా సంపాదనంతా దోచేశారని ఆరోపించారు.