: ఫేస్ బుక్ కష్టాలు
ఫేస్ బుక్ చక్కని సమాచార, భావవ్యక్తీకరణ సాధనం. కానీ, ఆ వ్యక్తీకరించే భావం ఎదుటి వారి మనసులను గాయపరచకుండా చూసుకోవాలి. లేకుంటే ఇలాంటి కష్టాలే ఎదురవుతాయి. అంతేకాదు, చిన్న పిల్లలు ఫేస్ బుక్ వాడడం వల్ల జరిగే అనర్థాలనూ ఇది తెలియజేస్తోంది.
హైదరాబాద్ నగరంలోని మౌలాలీలో ఒక ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటున్న పదేళ్ల బాలిక ఫేస్ బుక్ లో తన అక్క స్నేహ(23), బావ అనిల్ కుమార్ (29) ఫొటో చూసింది. వీరు కవాడీగూడలో ఉంటారు. అయితే, అనిల్ బాలేడంటూ కామెంట్ చేసింది. ఇది అందరికీ చేరేసరికి తమ పరువు పోయిందని అనిల్ దంపతులు ఆగ్రహించారు. స్కూలుకి వెళ్లి మరీ ఆ చిన్నారిపై దాడి చేశారు. బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు అనిల్ దంపతులపై కేసు పెట్టి వారిని అరెస్ట్ చేశారు.