: నెట్ ద్వారా ఇలా కూడా ఉపయోగం వుందట!
ఇంటర్నెట్ ద్వారా పలు ప్రయోజనాలున్నాయి. ఇప్పుడు చాలామంది ఫేస్‌బుక్‌లు, ట్విట్టర్‌లు ఇలా పలు రకాలైన సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లద్వారా ఒకరికి ఒకరు దూరంగా ఉన్నా అందుబాటులో ఉంటున్నారు. ఇలాంటి వాటిద్వారా అంటువ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. కొన్ని సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లను పరిశీలిస్తే వాటిలో ప్రజలు పేర్కొన్న అంశాల ఆధారంగా అంటువ్యాధుల వ్యాప్తిని ముందుగానే గుర్తించే వీలుంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
వాటర్‌లూ విశ్వవిద్యాలయం, యేల్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటివి అంటువ్యాధుల వ్యాప్తిని ముందుగానే గుర్తించడానికి ఉపయోగపడతాయని చెబుతున్నారు. వీరు నిర్వహించిన అధ్యయనంలో ఇలాంటి వాటిలో ప్రజలు పేర్కొన్న అంశాల ఆధారంగా అంటువ్యాధులను ముందుగానే గుర్తించే వీలుంటుందని చెబుతున్నారు. వాటర్‌లూ విశ్వవిద్యాలయంలో అప్లైడ్ మ్యాథమాటిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న క్రిస్ బాచ్, యేల్ విశ్వవిద్యాలయానికి చెందిన అలిసన్ గల్వాని మాట్లాడుతూ రోగులు వ్యాధిని దూరం చేసుకోవడానికి ఎలా స్పందిస్తారో, దానిపై అంటువ్యాధుల వ్యాప్తి ఆధారపడి ఉంటుందని, రోగులు తమ రోగాలపై స్పందించే తీరును, వారు వ్యాధికి సంబంధించి అనుసంధాన వేదికల్లో వెల్లడించే వివరాలను అధ్యయనం చేయడం ద్వారా అంటువ్యాధుల వ్యాప్తిని ముందుగానే పసిగట్టవచ్చని చెబుతున్నారు.