: తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కాంట్రాక్టు ఉద్యోగీ ఉండడు: కేసీఆర్
తెలంగాణ రాష్ట్రం వచ్చాక రాష్ట్రంలో ఒక్క కాంట్రాక్టు ఉద్యోగీ ఉండడని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు హామీ ఇచ్చారు. హైదరాబాదులోని మింట్ కాంపౌండులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, విద్యుత్ లేకుండా జీవితాలు లేవని, ఎంతో ప్రాధాన్యమున్న రంగమని పేర్కొన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ శాఖలోని కాంట్రాక్టు ఉద్యోగాలన్నింటినీ క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగమంటే శ్రమదోపిడీ తప్ప మరోటి కాదని అన్నారు. కాగా, హైదరాబాదును పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉంచేందుకు తాము ఒప్పుకున్నామని చెప్పారు.