: సీమాంధ్రులవి పెద్ద సమస్యలేమీ కాదు: జైపాల్ రెడ్డి
సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం చూస్తుంటే ఆందోళన కలుగుతోందని, అయితే, వారి సమస్యలు పరిష్కరించలేనంత పెద్దవేమీ కాదని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. హైదరాబాదు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మీడియాతో మాట్లాడుతూ.. సీమాంధ్రలు రాష్ట్ర విభజనపై ఇంతలా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. దశాబ్దాలుగా ఉన్న సమస్యకు పరిష్కారం చూపాల్సిన సమయం వచ్చింది కాబట్టే తెలంగాణ ప్రకటించారని జైపాల్ రెడ్డి వివరించారు. ఇక హైదరాబాదుపై స్పందిస్తూ.. నగరం అందరిదీనన్నారు. ఎవరైనా ఇక్కడ బతకవచ్చని స్పష్టం చేశారు.