: సీమాంధ్ర ప్రజలను మోసం చేయొద్దు: వీహెచ్


సీమాంధ్ర ప్రజలను మోసం చేయొద్దని ఆ ప్రాంత పార్టీలు, నాయకులను ఎంపీ వీహెచ్ కోరారు. యాదగిరి గుట్టలో ఆయన మాట్లాడుతూ, హైదరాబాదులో జగన్, ఢిల్లీలో చంద్రబాబు దీక్షలకు పూనుకోవడం సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టడమేనన్నారు. సమైక్య ఉద్యమం కొందరు పెట్టుబడిదారుల కనుసన్నల్లో జరుగుతోందన్నారు. అశోక్ బాబు తన మాటలతో తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చిన ఘనత సోనియాకే దక్కిందని వీహెచ్ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News