: వాయిదాపడిన అక్బరుద్దీన్ బెయిల్ పిటిషన్ విచారణ
గతంలో
కలెక్టర్ ను దూషించిన కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ బెయిల్ పిటిషన్
పై విచారణను సంగారెడ్డి న్యాయస్థానం ఏడో అదనపు న్యాయమూర్తి మంగళవారానికి
వాయిదా వేశారు. నాలుగు రోజుల క్రితం బెయిల్ పిటిషన్ ను అక్బరుద్దీన్ లాయర్ దాఖలు చేశారు. దీనిపై విచారణను రేపు చేపడతామని కోర్టు తెలిపింది. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా జైలులో అక్బరుద్దీన్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు.