: తిరుమల చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దంపతులు తిరుమల చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహం వద్ద కిరణ్ దంపతులకు టీటీడీ జేఈవో శ్రీనివాసరావు ఘనస్వాగతం పలికారు. తిరుమల బ్రహ్మోత్సవాలు నేడు ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వం తరపున సీఎం దంపతులు శ్రీవారికి సాయంత్రం పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.