: నిజాయతీ అనే పదం జగన్ డిక్షనరీలోనే లేదు: హరీశ్ రావు
వైఎస్సార్సీపీ అధినేత జగన్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ధ్వజమెత్తారు. హైదరాబాదులోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, నిజాయతీ అనే పదం జగన్ డిక్షనరీలోనే లేదని విమర్శించారు. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడే సీమాంధ్ర రాష్ట్రంలో ఆధిపత్యం కోసమే జగన్ ఆమరణ దీక్ష పేరిట నాటకాలాడుతున్నాడని దుయ్యబట్టారు. దీక్షల పేరుతో హైదరాబాదులో ఫ్యాక్షన్ రాజకీయాలు వ్యాప్తి చేయాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హరీశ్ హెచ్చరించారు.