: పుత్తూరులో నలుగురు ఉగ్రవాదులు


చిత్తూరు జిల్లా పుత్తూరులోని ఓ ఇంట్లో నలుగురు ఉగ్రవాదులు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. తమిళనాడు, ఆంధ్రా పోలీసులతో పాటు, ఆక్టోపస్ దళాలు ఇంటిని ముట్టడించాయి. వీరిని అల్ ఉమా ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా భావిస్తున్నారు. తమిళనాడులో బీజేపీ నేత రమేశ్ హత్యకేసులో నిందితుడు బిలాల్ కూడా ఉగ్రవాదుల బృందంలో ఉన్నట్టు సమాచారం. దీంతో వెయ్యిమంది పోలీసులు ఈ ఇంటిని ముట్టడించారు. ఉగ్రవాదుల వద్ద బాంబులు ఉన్నాయన్న అనుమానంతో బాంబ్ స్క్వాడ్ ను కూడా పిలిపించారు. ఉగ్రవాదుల అదుపులో ఓ పోలీస్ అధికారి ఉన్నట్టు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలం వద్ద పోలీస్ ఆపరేషన్ ను ముగ్గురు ఎస్పీలు పర్యవేక్షిస్తున్నారు. కాగా, ఉగ్రవాదుల కాల్పుల్లో తమిళనాడు సీఐ లక్ష్మణ్ తో పాటు ఓ కానిస్టేబుల్ కూడా మరణించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News