: ఆసుపత్రిలో ఆంటోనీ.. పరామర్శించిన ప్రధాని


రక్షణ మంత్రి ఏకే ఆంటోనీకి ఇటీవలే ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్లో ప్రోస్టేటు గ్రంథికి సంబంధించిన శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో ఉన్న ఆంటోనీని ప్రధాని మన్మోహన్ సింగ్ నేడు పరామర్శించారు. ఆయన వద్ద ప్రధాని దాదాపు పదిహేను నిమిషాలు గడిపారు. క్యాబినెట్ సహచరుడి ఆరోగ్యస్థితిని అడిగి తెలుసుకున్నారు.

  • Loading...

More Telugu News