: కానిస్టేబుల్ మృతి.. పుత్తూరుకు ఆక్టోపస్ బలగాలు


పుత్తూరులో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో నిన్న అర్ధరాత్రి నుంచి పోలీసులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టెర్రరిస్టులు పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక కానిస్టేబుల్ మరణించాడు. కాగా, ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న అనుమానంతో చిత్తూరు జిల్లా పుత్తూరుకు ఆక్టోపస్ బలగాలను తరలించినట్లు డీజీపీ ప్రసాదరావు తెలిపారు. తమిళనాడు పోలీసులతో కలిసి స్థానిక పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహిస్తున్నారని ఆయన వెల్లడించారు. దాడికి పాల్పడ్డవారు అల్ ఉమా తీవ్రవాదులని అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News