: సమైక్యవాదులకు..పోలీసులకు మధ్య ఘర్షణ.. అలిపిరి వద్ద ఉద్రిక్తత
ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రానున్నారన్న వార్త తెలియడంతో, తెల్లవారు జామునే అలిపిరి ఘాట్ రోడ్డుకు చేరుకున్న సమైక్యవాదులు సీఎంను అడ్డుకునేందుకు ప్రణాళిక రచించారు. దీంతో జరగబోయే పరిణామాలు పసిగట్టిన పోలీసులు సమైక్యవాదులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా సమైక్యవాదులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. సమైక్యవాదులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో అలిపిరి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తిరుమలలో బంద్ తీవ్ర రూపం దాల్చడంతో ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.