: రేపు శ్రీవారికి ముఖ్యమంత్రి పట్టువస్త్రాల సమర్పణ
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రేపు మధ్యాహ్నం తిరుమలకు బయలుదేరి వెళుతున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు రాత్రి జరిగే శ్రీవారి పెద్ద శేషవాహన సేవలో ఆయన పాల్గొని, స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది .