: ఎమ్మెల్యే అవుతానా? లేదా? అనే భయం బాబును పీడిస్తోంది: కేటీఆర్


కనీసం ఎమ్మెల్యేగా అయినా గెలుస్తానా? లేదా? అనే భయం చంద్రబాబు నాయుడును పట్టిపీడిస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో టీఆర్ఎస్ భవన్ లో ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర ఉద్యోగుల ఉద్యమంపై అతి ప్రేమ ఒలకబోస్తున్న బాబుకు, తెలంగాణ ఉద్యోగుల త్యాగాలు కనబడలేదా? అని ప్రశ్నించారు. సీమాంధ్రులకు అన్యాయం జరిగిందని ఢిల్లీలో దీక్ష చేస్తానని అంటున్న చంద్రబాబు నాయుడుకు తెలంగాణలో జరిగిన ఉద్యమం కనబడలేదా? అని నిలదీశారు.

  • Loading...

More Telugu News