: జగన్ దీక్షకు అనుమతివ్వొద్దు: డీజీపీని కోరిన వీహెచ్
వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్షకు, ఈనెల 19న వైసీపీ తలపెట్టిన 'సమైక్య శంఖారావం' సభకు అనుమతివ్వొద్దని డీజీపీని కోరినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తెలిపారు. ఈ మేరకు కొంతసేపటి కిందట డీజీపీ ప్రసాదరావును కలిశానని చెప్పారు. హైదరాబాదులో జగన్ సభలు, దీక్షలు చేయడంవల్ల పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని చెప్పానని అన్నారు.