: చైనా ఓపెన్ ఫైనల్లో సానియా


డబ్ల్యూటీఏ చైనా ఓపెన్ లో మహిళల డబుల్స్ విభాగంలో... సానియా మీర్జా, జింబాబ్వేకు చెందిన కారా బ్లాక్ జంట ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీఫైనల్లో ఇటలీకి చెందిన టాప్ సీడ్ సారా ఇరానీ, రాబర్టా విన్సీల జంటను 6-4, 6-4 వరుస సెట్లతో సానియా జంట ఓడించింది. సానియా, కారా బ్లాక్ జంట మొదటి సెట్ ను 37 నిమిషాల్లో, రెండో సెట్ ను 36 నిమిషాల్లో ముగించింది. ఇటీవలే సానియా, బ్లాక్ జంట టోక్యోలో జరిగిన పాన్ పసిఫిక్ ఓపెన్ ను గెలుచుకుంది.

  • Loading...

More Telugu News