: జగన్, చంద్రబాబు మాట మారుస్తున్నారు : డీకే అరుణ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి మొదట అనుకూలంగా మాట్లాడిన చంద్రబాబు, జగన్ లు ఇప్పుడు మాటమారుస్తున్నారని మంత్రి డీకే అరుణ విమర్శించారు. ఎవరంతట వారు ఊసరవెల్లులుగా రంగులు మారుస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా... హైదరాబాద్ లో ఎవరూ అభద్రతా భావంతో ఉండాల్సిన అవసరం లేదని అరుణ తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా జగన్ నిరాహారదీక్ష చేస్తాననడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.