: రేపటి నుంచి జగన్ ఆమరణ నిరాహార దీక్ష
రాష్ట్ర విభజనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదానికి నిరసనగా రేపటి నుంచి తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నట్టు వైయస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాదు వైసీపీ ఆఫీసు ఎదుటే నిరశన దీక్ష చేబడతానని ఆయన చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం లేకుండా ఎక్కడా విభజన జరగలేదని జగన్ గుర్తు చేశారు.