: కృష్ణా జిల్లాలో స్తంభించిన జనజీవనం
తెలంగాణ నోట్ పై కేంద్ర కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా కృష్ణా జిల్లాలో 48 గంటల బంద్ కొనసాగుతోంది. విద్యా, వ్యాపార సంస్థలు, వాణిజ్య సముదాయాలు స్వచ్చంధంగా బంద్ లో కొనసాగుతూ తమ నిరసన తెలుపుతున్నారు. విజయవాడ బెంజి సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్ వద్ద జాతీయ రహదారులను సమైక్యవాదులు దిగ్బంధించారు. అటు నందిగామలో నిరసనలు కొనసాగుతున్నాయి. బంద్ కు నిరసనగా షాపులను మూసివేశారు. నూజివీడులో జేఏసీ నేతలు పట్టణంలో అన్ని రోడ్లను దిగ్బంధించారు.