: తెదేపా, వైకాపా ఘర్షణతో ఉద్రిక్తంగా మారిన అనంత


అనంతపురంలో తెలుగుదేశం, వైఎస్సార్ సీపీ పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పట్టణంలోని సప్తగిరి కూడలిలో తెదేపా కార్యకర్తలు చేస్తున్న సమైక్యాంధ్ర ర్యాలీని వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు. అంతేకాకుండా... తెదేపా ఎమ్మెల్యే, కార్యకర్తలపై వైకాపా కార్యకర్తలు కుర్చీలు, రాళ్లతో దాడి చేశారు. దీంతో తెదేపా కార్యకర్తలు కూడా ప్రతి దాడికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News