: డోన్ లో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ధ్వంసం
తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో... కర్నూలు జిల్లాలో ఆందోళనలు మిన్నంటాయి. జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. బంద్ ను సమైక్యవాదులు, ఏపీఎన్జీవోలు పర్యవేక్షిస్తున్నారు. డోన్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై సమైక్యవాదులు రాళ్ల వర్షం కురిపించి, విధ్వంసం సృష్టించారు. పార్టీ బ్యానర్లను, ఫ్లెక్సీలను చింపివేశారు.