: మెరుపు చార్జింగ్ సాధ్యమే!


తటాలున కళ్లను మిరుమిట్లు గొలిపే మెరుపును ఒడిసి పడితే... అసాధ్యం అనుకుంటున్నారా... కానీ అలా చేసి చక్కగా మొబైల్‌ను ఛార్జింగ్‌ చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన కళ్లను మిరుమిట్లు గొలిపే మెరుపుతో మన మొబైల్‌ను ఛార్జింగ్‌ చేసుకోవచ్చని ప్రయోగాత్మకంగా నిరూపించారు కూడా.

బ్రిటన్‌లోని సౌంతాంప్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు మెరుపు, పిడుగుల నుండి వచ్చే విద్యుత్తుతో మొబైల్‌ను ఛార్జింగ్‌ చేసుకోవచ్చని ప్రయోగాత్మకంగా నిరూపించారు. నోకియా లూమియా ఫోన్‌ను ఇలా ఛార్జింగ్‌ చేసిచూపించారు కూడా. ప్రయోగశాలలో రెండు లక్షలకు పైగా వోల్టుల విద్యుత్తును వినియోగించి వీరు ఒక కృత్రిమ మెరుపును సృష్టించారు. దాని ద్వారా ఫోన్‌ను ఛార్జింగ్‌ చేశారు. ఈ వివరాలను నోకియా సంస్థ వెల్లడించింది.

  • Loading...

More Telugu News