: సీమాంధ్ర జిల్లాల్లో రగిలిన ఆగ్రహ జ్వాలలు
తెలంగాణ నోట్ కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడంతో సీమాంధ్ర జిల్లాల్లో ఆగ్రహ జ్వాలలు ఎగిసి పడుతున్నాయి. ఈ పరిణామంతో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఆందోళనలు మరింత ఉద్ధృతమవుతున్నాయి. పలు జిల్లాల్లో సమైక్యవాదులు వివిధ రూపాల్లో తమ నిరసనలు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కొత్త పేటలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆందోళన కారులు ధ్వంసం చేశారు. పులివెందులలో సమైక్యవాదులు రహదారులపై ఆందోళన చేశారు. విజయవాడలో ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇంటిని ముట్టడించేందుకు సమైక్యవాదులు యత్నించారు. బెంజ్ సర్కిల్ వద్ద టైర్లతో మంటలు వేసి ఆందోళన చేయడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.