: ఓడలో అగ్ని ప్రమాదం.. 94 మంది మృతి


ఆఫ్రికా నుంచి యూరోప్ వెళ్తున్న ఓ ఇటలీ ఓడలో అగ్నిప్రమాదం సంభవించడంతో 94 మంది మృతి చెందగా, 150 మందిని రక్షించారు. మరో 200 మంది జాడ తెలియాల్సి ఉంది. ఇటలీ ద్వీపకల్పం లాపెండుసా సమీపంలో ప్రమాదకరమైనదిగా భావించే మెడీటెరనీన్ సముద్రంలో ఈ దారుణం సంభవించింది. ఘనా, సోమాలియా, డి మిల్లాకు చెందిన దాదాపు 500 మంది ప్రయాణీకులను తీసుకుని ట్రిపోలీ నుంచి షిప్ బయల్దేరింది. ఇంతలో ప్రమాదం సంభవించింది. ఈ దురదృష్టకర ఘటనలో ప్రమాదానికి గురైన నౌకలోని ప్రజలంతా ఆఫ్రికా ఖండానికి చెందినవారే.

బతుకు తెరువుకోసం యూరప్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో ప్రాణాలు రక్షించుకునేందుకు పలువురు సముద్రంలో దూకినట్టు సమాచారం. వీరిలో కొంతమందిని సముద్రగస్తీ నౌకలు, చేపలు పట్టే పడవలు రక్షించగా హెలీకాప్టర్ల సాయంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News