: సచిన్ రిటైర్మెంట్ అతనిష్టం


సచిన్ రిటైర్మెంట్ పై వస్తున్న పలు ఊహాగానాలకు బీసీసీఐ తెరదించే ప్రయత్నం చేసింది. 200వ టెస్ట్ మ్యాచ్ తర్వాత సచిన్ ను బీసీసీఐ రిటైర్ కావాలని అడిగినట్టు వస్తున్న వార్తలను బీసీసీఐ సెక్రెటరీ సంజయ్ పటేల్ ఖండించారు. రెటైర్మెంట్ పై నిర్ణయం తీసుకోవాల్సింది మాస్టరేనని... అతనిపై బీసీసీఐ ఒత్తిడి తీసుకురాదని తెలిపారు. రిటైర్ కమ్మని చెప్పడానికి సచిన్ ఆషామాషీ ఆటగాడు కాదని అన్నారు. సచిన్ రిటైర్మెంట్ పై ముంబైలో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ పటేల్ ఈ విధంగా స్పందించారు. సచిన్ ఏ నిర్ణయం తీసుకున్నా బోర్డు దాన్ని సమర్థిస్తుందని తెలిపారు.

  • Loading...

More Telugu News