: కాంగ్రెస్ ను విమర్శిస్తే ఊరుకోను : కొండ్రు మురళి


సీమాంధ్ర కాంగ్రెస్ నేతల సమావేశంలో మంత్రి కొండ్రు మురళి, ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మధ్య వాగ్వివాదం జరిగింది. కాంగ్రెస్ పార్టీని ఎవరు విమర్శించినా సహించేది లేదని సమావేశంలో కొండ్రు అన్నారు. రాష్ట్ర విభజన ఎందుకో చెప్పమంటే సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ తప్పించుకుంటోందని ఆమంచి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ను తాను విమర్శిస్తానని... ఏం చేస్తారని? మంత్రి కొండ్రును ఆమంచి నిలదీశారు. ఇంతలో ఇతర నేతలు కలగజేసుకుని ఇద్దరికీ సర్దిచెప్పారు.

  • Loading...

More Telugu News