: ఇది రాజకీయాలు చేసే సమయం కాదు: శైలజానాథ్
ఇది రాజకీయాలు చేసే సమయం కాదని మంత్రి శైలజానాథ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఐక్యత కోసం అన్ని అంశాల్లో నిజాయతీగా ఉంటున్నామన్నారు. ఆగస్టు 3 న చేసిన తీర్మానానికి అనుగుణంగా సమైక్యానికే కట్టుబడాలని అంతా నిర్ణయించినట్టు స్పష్టం చేశారు. శాసనసభ ముందుకు వస్తే తెలంగాణ తీర్మానాన్ని ఓడించాలని నిర్ణయించామన్నారు. ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి అన్ని విషయాలు చర్చించాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. సమైక్యవాదం ముఖ్యమంత్రి బలంగా వినిపిస్తున్నారని, ఆయనను తామంతా బలపర్చాలని నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు.