: 'టీ-నోట్' పై వార్తలు ఊహాగానాలే: షిండే
కేంద్ర కేబినెట్ లో ఈ సాయంత్రం తెలంగాణ నోట్ వస్తుందన్న వార్తలపై కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే స్పందించారు. తెలంగాణ అంశంపై వస్తున్న వార్తలు ఊహాగానాలేనన్నారు. కేబినెట్ నోట్ పై మంత్రివర్గంలో ఇంతవరకు ఎలాంటి నిర్ణయానికి రాలేదన్నారు. ఆంటోనీ కమిటీ నివేదిక ఇంకా రాలేదని షిండే చెప్పారు. అంటే కమిటీ నివేదిక ఇచ్చే సిఫార్సులను జతచేసాకే నోట్ కేంద్ర మంత్రివర్గం ముందుకు వెళుతుందని రెండు రోజుల కిందటే పీటీఐ తన కథనంలో పేర్కొంది. షిండే మాటలు, పీటీఐ కథనాన్ని బట్టి చూస్తే 'టీ-నోట్' కేబినెట్ ముందుకు రాదని అర్ధం చేసుకోవచ్చు.