: 2014 వరకు రాష్ట్ర విభజన జరగదు: ఉండవల్లి
ఓ వైపు తెలంగాణ నోట్ కేంద్ర మంత్రివర్గం ముందుకు వస్తుందన్న వార్తల నేపథ్యంలో ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాత్రం అందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. 2014 వరకు రాష్ట్ర విభజన జరగదంటున్నారు. తీర్మానానికి వ్యతిరేకంగా ఎవరూ రాష్ట్రాన్ని విభజించలేరన్నారు. ఇళ్ల ముట్టడితో రాజీనామాలు ఆమోదం పొందవని, విభజనను అడ్డుకునే దిశగా తమ కార్యాచరణ వెల్లడిస్తామన్నారు.