: కోట్లాది మంది ప్రజలను కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ మోసం చేస్తున్నాయి: పయ్యావుల


కోట్లాది మంది ప్రజలను కాంగ్రెస్, వైఎస్సార్ సీపీలు మోసం చేస్తున్నాయని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ సమైక్య రాష్ట్రాన్ని కోరుతూ అన్ని వర్గాల ప్రజలతో పాటు కూలీలు సైతం రోడ్డెక్కారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆంటోనీ కమిటీని రాష్ట్రానికి పంపుతామని, అందరి అనుమానాలను నివృత్తి చేస్తామని చెప్పి నిన్నటి వరకు ప్రజలను మభ్యపెడుతూ వచ్చిందని విమర్శించారు. హఠాత్తుగా తెలంగాణ నోట్ ను కేబినెట్ కమిటీ ముందుకు తీసుకెళ్తున్నానడం తెలుగువారిపై ఉన్న నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుందని ఆయన మండిపడ్డారు.

తెలుగు జాతిని నిలువుగా చీల్చాలనుకుంటున్న సోనియాకు బొత్స, వైఎస్సార్ సీపీ సహకారం అందిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి స్వార్థ ప్రయోజనాలకోసం రాష్ట్ర విభజన జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ కేసులో ఒక్క రోజులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మారాడు, బెయిల్ వచ్చింది, దీంతో తెలంగాణ నోట్ కేబినెట్ ముందుకు వస్తుందని తెలిపారు. దిగ్విజయ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్నాడు అతనిని సీబీఐ డెరెక్టర్ ఎందుకు కలిశారని ప్రశ్నించారు. ఈ పరిణామాలను గమనిస్తే తెలుస్తుందని అన్నారు.

జగన్ జైల్లో ఉండగా ఆ పార్టీ నేతలు రాజీనామాలు చేశారు. ఇప్పుడు కేబెనెట్ ముందుకు నోట్ వస్తుందని తెలియడంతోనే 175 నియోజకవర్గాల్లో ఉద్యమం చేపట్టారని దుయ్యబట్టారు. ఒక బెయిలు, రెండు రాష్ట్రాలు అనే నినాదంతోనే కేంగ్రెస్ పార్టీ కేబినెట్ నోట్ ధైర్యం చేసిందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News