: వేడెక్కిన హస్తిన.. సీమాంధ్ర నేతల హడావుడి


ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో హస్తిన వేడెక్కుతోంది. సాయంత్రం జరిగే కేబినెట్ భేటీకి తెలంగాణ నోట్ టేబుల్ అజెండాగా రానుందన్న వార్తతో సీమాంధ్ర నేతల్లో అలజడి మొదలైంది. దీంతో దేశరాజధాని, రాష్ట్ర రాజధానిలో నేతల భేటీలు జోరందుకున్నాయి. యూపీఏ అధినేత్రి సోనియా గాంధీతో గులాం నబీ ఆజాద్ భేటీ కాగా, హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా సోనియాతో సమావేశం కానున్నారు. మరో వైపు వీరప్ప మొయిలీతో కావూరి సాంబశివరావు భేటీ అయ్యారు. ముఖ్యమంత్రితో పలువురి నేతల భేటీలు ఊపందుకున్నాయి. ఎంపీలు రాజీనామాలు ఆమోదించుకుంటామని, డిగ్గీ రాజా తమను మోసం చేశాడని తోకతొక్కిన తాచుల్లా బుసలు కొడుతున్నారు.

  • Loading...

More Telugu News