: ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఏమైనా జరిగితే అగ్నిగుండమే : వీరశివారెడ్డి
ఈ రోజు సాయంత్రం కేబినేట్ మీటింగ్ లో షిండే తెలంగాణపై టేబుల్ నోట్ ప్రవేశపెడుతున్నారన్న వార్త సంచలనం రేపుతోంది. కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరశివారెడ్డి విరుచుకుపడ్డారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటే... రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని తీవ్రంగా హెచ్చరించారు. కేంద్ర మంత్రుల చేతకానితనం వల్లే నోట్ ప్రవేశపెడుతున్నారని విమర్శించారు. విభజన విషయం కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుకు ముందే తెలుసని... అయినా నోరు మూసుకుని కూర్చున్నారని మండిపడ్డారు. మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నారని విమర్శించారు.