: అఫ్జల్ గురు ఉరిశిక్షపై దద్దరిల్లిన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ
పార్లమెంటు దాడి ఘటనలో నిందితుడు అఫ్జల్ గురుకు ఉరిశిక్ష అమలుపై జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం చెలరేగింది. ఈ అంశంపై చర్చించాలని ప్రతిపక్ష పీపుల్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) డిమాండు చేసింది. దీనిపై చర్చ చేయాల్సిందేనని అధికార పార్టీ నేషనల్ కాప్ఫరెన్స్ (ఎన్ సీ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మార్క్సిస్టు (సీపీఐ ఎమ్) సభ్యులు పట్టుబట్టారు.
అయితే ఈ అంశంపై సభలో వాయిదా తీర్మానం పెట్టాల్సిందేనని పీడీపీ డిమాండు చేసింది. ఆ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ, ముఖ్యమైన ఈ విషయంపై సభలో వాయిదా తీర్మానం పెట్టాలని కోరారు. ఇందుకు ఎన్ సీ నేత నాసిర్ అస్లాం, సీపీఐ ఎమ్ నాయకుడు మోహమ్మద్ యూసఫ్ తరిగామీలు మద్దతు పలికారు. ఇందుకు అంగీకరించిన స్పీకర్ ముబారక్ గుల్ సమావేశాలు నడిపే యత్నం చేయగా మళ్లీ సభకు సభ్యులు అడ్డుతగిలారు. దీంతో స్పీకర్ సభను గంటపాటు వాయిదా వేశారు.

అంతకుముందు గురువారం నాడు కాశ్మీర్ బడ్జెట్టు సమావేశాలు మొదలయ్యాయి. తొలిరోజే అఫ్జల్ అంశానికి సంబంధించి పీడీపీ డిమాండు చేసింది. జమ్మూకాశ్మీర్ పౌరుల రక్షణ, హక్కులు కాపాడటంలో సర్కార్ విఫలమైందనీ, తన అసమర్ధతను చాటిందని పీడీపీ విమర్శించింది. దీనివల్ల అఫ్జల్ చట్టపరమైన హక్కులు కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఉరిశిక్ష విధించాలని భారత్ న్యాయస్థానం తీర్పునిచ్చిన వారిలో గురు 28వ వ్యక్తని చెప్పింది.
కనీసం సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అతనికి అవకాశం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. అఫ్జల్ క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించబడిన తర్వాత చివరిగా సుప్రీంకు వెళ్లే అవకాశం ఇవ్వాలనీ, కానీ ఇవ్వలేదనీ అన్నారు. దీంతో తన చట్టపరమైన హక్కును అతడు కోల్పోయాడని పీడీపీ పేర్కొంది. అంతేగాక, అపవిత్ర పద్ధతిలో రహస్యంగా ఉరితీశారని సభలో వాదించింది. అఫ్జల్ గురు అవశేషాలనైనా సరైన విధంగా ఖననం చేసేందుకు కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలని పార్టీ శాసనసభ్యులు డిమాండు చేశారు.