: అనాథప్రేతానికి సంస్కారాలు నిర్వహించిన వెంకయ్య నాయుడి కుటుంబం
ఉత్తరాఖండ్ హరిద్వార్ లో ఓ అనాథప్రేతానికి నేడు బీజేపీ అగ్రనేత వెంకయ్య నాయుడి సతీమణి ఉషమ్మ, కుమార్తె దీపా వెంకట్ దహన సంస్కారాలు నిర్వహించారు. ఆ శవం ఎవరిదో తెలియకపోవడంతో వెంకయ్య నాయుడి కుటుంబం తాము అంత్యక్రియలు జరుపుతామంటూ ముందుకొచ్చింది. అనంతరం అక్కడ పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు.