: పరిపాలన నిర్ణయాల్లో ప్రజల భాగస్వామ్యం ఉండాలి: మోడీ
పరిపాలన పరమైన నిర్ణయాల్లో ప్రజల భాగస్వామ్యం ఉండాలని బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలోని త్యాగరాజు ఇండోర్ స్టేడియంలో జరిగిన సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానాల్లో రహస్యాలు ఉండకూడదని, అందుకే గుజరాత్ ప్రభుత్వ విధానాలను ఆన్ లైన్లో ఉంచామని తెలిపారు. దేశంలో ప్రజాపంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ధరల నియంత్రణ కమిటీకి తనను చైర్మన్ గా నియమించారని, దీనిపై నివేదిక ఇచ్చి రెండేళ్లయినా అదేమయిందో తెలియదని అన్నారు. ధరల నియంత్రణపై ఆ నివేదికలో 62 అంశాలను తాను నివేదించినట్లు చెప్పారు. భారత ఆహార సంస్థను 3 విభాగాలుగా వికేంద్రీకరించాలని సూచించినట్టు స్పష్టం చేశారు.