: దిగ్విజయ్ ను కలిసిన సీబీఐ డైరక్టర్


సీబీఐ డైరక్టర్ రంజిత్ సిన్హా నేడు ఢిల్లీలో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ను కలిశారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ భేటీలో జగన్ బెయిల్ వ్యవహారం, ఇతర కేసులు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే, సీబీఐ డైరక్టర్ స్థాయి వ్యక్తి ఓ రాజకీయ నేతను స్వయంగా వెళ్ళి కలవడం పలు అనుమానాలకు తావిస్తోందని ప్రతిపక్షాలంటున్నాయి. ఇటీవలే జగన్ బెయిల్ పై బయటికొచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్, వైఎస్సార్సీపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని వార్తలొచ్చాయి. ఈ తరుణంలో సిన్హా, దిగ్విజయ్ ను కలవడం వివాదాస్పదమైంది.

  • Loading...

More Telugu News