: కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ లో 'రైతు గర్జన'
ఏపీఎన్జీవోల ఆధ్వర్యంలో ప్రస్తుతం విజయవాడ హనుమాన్ జంక్షన్ లో 'రైతు గర్జన' మహాసభ జరుగుతోంది. సభకు ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు, ఇతర ఉద్యోగులు, భారీగా ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన రైతు సంఘం నేత ఆంజేయులు.. సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె జీతం కోసం కాదని జీవితం కోసమని అన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం ఎవరిని అడిగి తీసుకున్నారని ప్రశ్నించారు. కేసీఆర్, కోదండరాంలకు రైతుల సమస్యలు తెలుసా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.