: ములాయం సింగ్ నన్ను చంపేస్తాడు: బేణీప్రసాద్


ములాయం సింగ్ యాదవ్ నన్ను ఏ క్షణంలోనైనా చంపేస్తాడని కేంద్ర మంత్రి బేణీప్రసాద్ వర్మ ఆందోళన వ్యక్తం చేశాడు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన మతకల్లోలాలపై తానొక్కడినే ములాయంకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాని.. అందుకే తన ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని తెలిపారు. యూపీ అల్లర్ల తర్వాత సమాజ్ వాది పార్టీ, బీజేపీ రెండూ చేతులు కలిపాయని విమర్శించారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని కోరారు. గతంలో ములాయం, బేణీప్రసాద్ ఇద్దరూ మంచి మిత్రులే. కానీ ఇద్దరికీ మధ్యలో చెడింది. యూపీఏకు ములాయం సహకారం అందిస్తున్నప్పటికీ... బేణీప్రసాద్ మాత్రం అవకాశం వచ్చినప్పుడల్లా ములాయంను విమర్శిస్తూనే ఉన్నారు. ఒకానొక సమయంలో ములాయంను ఉద్దేశిస్తూ... 'ఆయన ప్రధానిగా కాదు ప్రధాని నివాసాన్ని ఊడ్చడానికి కూడా పనికిరాడు' అని బేణీ విమర్శించారు.

  • Loading...

More Telugu News